Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్‌స్టాగ్రామ్‌లో స్పేర్‌ పార్ట్స్‌ పేరుతో రూ.5.30 కోట్ల మోసం

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Sep 02, 2026 4:17 PM ఆదిలాబాద్General
ఇన్‌స్టాగ్రామ్‌లో స్పేర్‌ పార్ట్స్‌ పేరుతో రూ.5.30 కోట్ల మోసం - Udayam
ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్‌ స్పేర్‌ పార్ట్స్‌ విక్రయాల పేరుతో దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో 140 మందిని మోసం చేసిన రాజస్థాన్‌కు చెందిన ప్రకాశ్‌కుమార్‌ ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇచ్చోడకు చెందిన వ్యాపారి నుంచి రూ.2.18 లక్షలు కాజేసినట్లు గుర్తించారు. నిందితుడి నుంచి రూ.లక్ష నగదు, రెండు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మోసం జరిగితే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ సూచించారు.

Comments

G
Loading comments...