వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ తీరంలో జరిగిన పడవ ప్రమాదం నేపథ్యంలో మత్స్యకారుల భద్రత కోసం ప్రభుత్వం పడవలకు ట్రాన్స్‌పాండర్ల ఏర్పాటు ప్రారంభించింది. బలుసుతిప్ప ఫిష్‌ల్యాండింగ్ సెంటర్‌లో సోమవారం 16 పడవలకు ఈ పరికరాలు అమర్చారు.
సముద్రంలో వ్యక్తి పడిపోవడం, ఇంజిన్‌లోపం, తుపాను వంటి అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సమాచారం అందించడంతో పాటు చేపలు ఎక్కువగా లభించే ప్రాంతాలను గుర్తించడంలో కూడా ఇవి ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

