Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేటలో పాపన్న విగ్రహం ఏర్పాటు చేయాలి

Follow Udayam on Google
విహార్ Aug 18, 2026 5:03 PM సూర్యాపేటGeneral
సూర్యాపేటలో పాపన్న విగ్రహం ఏర్పాటు చేయాలి - Udayam
సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి సందర్భంగా సూర్యాపేటలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గౌడ సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. బహుజనుల ఆత్మగౌరవం, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. పాపన్న చరిత్రను భావితరాలకు అందించేందుకు పట్టణంలో విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం స్థలం కేటాయించి విగ్రహ ఏర్పాటుతో పాటు జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...