ఇన్‌సర్వీస్ టెట్ పరీక్ష వేళల్లో మార్పు

తెలంగాణలో ఈ నెల 22న నిర్వహించనున్న ఇన్‌సర్వీస్ టెట్ పరీక్ష షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు. ఉదయం జరగాల్సిన పేపర్-1 పరీక్షను మధ్యాహ్నానికి, మధ్యాహ్నం జరగాల్సిన పేపర్-2 పరీక్షను ఉదయానికి మార్చారు.
ఎక్కువ మంది అభ్యర్థులు పేపర్-2 పరీక్షకు హాజరుకానుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు మారిన పరీక్ష వేళలను గమనించి, అందుకు అనుగుణంగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
Comments
Loading comments...
