Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజీనామా యోచనలో ఇన్‌స్పెక్టర్ నాగరాజు

వైష్ణవి శర్మ Jun 26, 2026 6:36 AM విజయవాడ 3 viewsabout 2 hours ago
రాజీనామా యోచనలో ఇన్‌స్పెక్టర్ నాగరాజు - Udayam Digital
విజయవాడ కృష్ణలంక మాజీ ఇన్‌స్పెక్టర్ ఎస్‌ఎస్‌వీవీ నాగరాజు పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. రోజురోజుకూ పెరుగుతున్న పని ఒత్తిడి నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. రౌడీషీటర్ గాదె సాయికృష్ణ ఘటనకు ముందే తన సన్నిహితుల వద్ద నాగరాజు ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఆయన, వ్యక్తిగత కారణాల రీత్యా యూనిఫామ్‌కు స్వస్తి పలకాలని యోచిస్తున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...