వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి మండలం లేమల్లె జడ్పీ హైస్కూల్ విద్యార్థి బన్న రావూరి మణికంఠ సాయి ఇన్‌స్పైర్ మానక్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. వెల్డింగ్ కార్మికుల రక్షణ కోసం అతడు రూపొందించిన ‘ప్రొటెక్టివ్ హెల్మెట్’ ప్రాజెక్టు ఈ ఘనత సాధించింది.
ప్రతిభ చూపిన విద్యార్థిని డీఈవో రామారావు, డీవైఈవోలు ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి మంచి గుర్తింపు తేవాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

