Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంద్రకీలాద్రిపై క్యూ లైన్లను పరిశీలించిన కలెక్టర్

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 2:27 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
ఇంద్రకీలాద్రిపై క్యూ లైన్లను పరిశీలించిన కలెక్టర్ - Udayam
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ క్యూ లైన్లలో భక్తులతో మాట్లాడారు. అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. క్యూ లైన్లలో తాగునీరు, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...