Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండిగో విమానంలో ఏసీ ఫెయిల్

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 20, 2026 8:07 AM జాతీయంGeneral
ఇండిగో విమానంలో ఏసీ ఫెయిల్ - Udayam
చండీగఢ్ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో విమానంలో ఎయిర్ కండిషనర్ పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేడి, ఉక్కపోత తాళలేక ప్రయాణికులు కాగితాలతో విసురుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేల రూపాయలు వెచ్చించి టికెట్లు కొనుగోలు చేసినప్పటికీ సరైన వసతులు కల్పించకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమాన యాజమాన్య నిర్లక్ష్యంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...