వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రభుత్వ కాలేజీలకు పెరిగిన ఆదరణ
భవేష్ కుమార్ Jun 27, 2026 5:34 AM హైదరాబాద్ 2 viewsabout 3 hours ago

ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో ప్రవేశాలు పెరుగుతున్నాయి. ఉచిత విద్య, నాణ్యమైన బోధన, పోషకాహారంతో పాటు క్రీడా సౌకర్యాల గురించి అధికారులు చేస్తున్న ప్రచారం వల్ల 23 రోజుల్లోనే 8 వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు.
ప్రైవేట్ కాలేజీల్లో లక్షల్లో ఫీజుల భారం మోయలేని మధ్యతరగతి తల్లిదండ్రులు, ఉచితంగా నాణ్యమైన విద్య అందుతోన్న ప్రభుత్వ కాలేజీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ఈ ఏడాది అడ్మిషన్లు భారీగా నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.
Comments
Loading comments...