వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ దిగువ మానేరు జలాశయం ఎండిపోవడంతో, సాగు, తాగునీటి కష్టాలపై ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. ఎండిపోయిన ప్రాజెక్టులో క్రీడలు ఆడుతూ ప్రభుత్వంపై తమ నిరసనను వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టులు ఎండిపోయాయని గంగుల ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి మేడిగడ్డ నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని, లేనిపక్షంలో తామే స్వయంగా రంగంలోకి దిగుతామని ఆయన హెచ్చరించారు.
Comments
Loading comments...

