వార్తలకు తిరిగి వెళ్లండి
భీమేశ్వరస్వామి ఆలయానికి పెరిగిన ఆదాయం

వేములవాడ రాజన్న అనుబంధ ఆలయమైన భీమేశ్వరస్వామి క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. ఏప్రిల్ నుండి జూన్ వరకు మూడు నెలల కాలంలో ఇక్కడ ₹1,000 విలువైన 4,600 అభిషేకం టికెట్లు విక్రయమవడంతో ఆలయానికి ₹46 లక్షల ఆదాయం సమకూరింది.
అభిషేకాలను ఇక్కడికి మార్చడంతో భక్తుల సంఖ్య రెట్టింపైంది. ఈ నెల 13న సోమవారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఒక్క రోజే రికార్డు స్థాయిలో 266 టికెట్లు అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...