Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడిమ్యాల ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన ప్రవేశాలు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 05, 2026 10:22 AM జగిత్యాలGeneral
కొడిమ్యాల ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన ప్రవేశాలు - Udayam
కొడిమ్యాల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉపాధ్యాయుల ప్రణాళిక, కృషితో ఇప్పటివరకు 329 మంది కొత్తగా చేరగా జిల్లాలోనే అత్యధిక ప్రవేశాలు నమోదయ్యాయి. వేసవి సెలవుల్లో ఇంటింటి ప్రచారం, నాణ్యమైన విద్యపై అవగాహన కల్పించడం, ఉచిత వసతులు వివరించడం ఫలితాన్నిచ్చాయి. విద్యార్థుల సంఖ్య పెరిగిన పాఠశాలలకు ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...