వార్తలకు తిరిగి వెళ్లండి

రాజస్థాన్, గుజరాత్, కోస్తాంధ్రా సహా పలు రాష్ట్రాల్లో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.
మరోవైపు ఢిల్లీ, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలలో రాబోయే రెండు మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఉక్కపోత వాతావరణం ఉంటుందని ఐఎండీ స్పష్టం చేసింది.
Comments
Loading comments...

