వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలు ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ ఈవో రాహుల్ సూచించారు. సోమవారం గ్రామంలోని రామాలయం మేదరి కాలనీలో పేరుకుపోయిన చెత్తను పంచాయతీ కార్మికుల సహాయంతో తీసివేయించి గ్రామ శివారుకు తరలించారు.
చెత్త పెరిగితే దోమల బెడద పెరిగి ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

