Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనధికార లేఅవుట్లతో కోట్ల దోపిడీ

Follow Udayam on Google
రేఖ దేవి Jul 16, 2026 7:26 AM పశ్చిమగోదావరి General
అనధికార లేఅవుట్లతో కోట్ల దోపిడీ - Udayam
పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అనధికార లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. స్థిరాస్తి వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తూ, ఎలాంటి భూ బదలాయింపు పన్నులు చెల్లించకుండా పొలాలను మట్టితో పూడ్చేసి ప్లాట్లుగా విక్రయిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. భీమవరం, తణుకు, పాలకొల్లు తదితర ప్రాంతాల్లో ఎకరం ధర రూ. కోట్లలో పలుకుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో విక్రేతలు రూ.కోట్లు గడిస్తుండగా, కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...