Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరకాలలో యథేచ్ఛగా అక్రమ ఇళ్ల నిర్మాణాలు

Follow Udayam on Google
రవళి దేవి Jul 25, 2026 11:37 AM హన్మకొండ General
పరకాలలో యథేచ్ఛగా అక్రమ ఇళ్ల నిర్మాణాలు - Udayam
హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో నిబంధనలను విస్మరించి సెట్‌బ్యాక్‌లు లేకుండా, అనుమతులు లేని అక్రమ ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. బఫర్‌ జోన్లు, చెరువు మత్తడి కాల్వల పక్కన కూడా భవనాలు కడుతున్నారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మొదటి నోటీసులు ఇచ్చామని, అక్రమ నిర్మాణాలపై త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ పవన్ తెలిపారు.

Comments

G
Loading comments...