Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్

Follow Udayam on Google
dineshkumar Aug 27, 2026 2:29 PM చిత్తూరుGeneral
ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్ - Udayam
చిత్తూరు కలెక్టరేట్‌లోని ఈవీఎం గోదాములను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం తనిఖీ చేశారు. గోదాము షట్టర్ల సీల్లు, తాళాలను పరిశీలించి, పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాల నిఘాపై సమీక్షించారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో కే. మోహన్ కుమార్, నోడల్ అధికారి శ్రీలక్ష్మి, ఎన్నికల సూపరింటెండెంట్ రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...