Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈస్సన్న పల్లి మీదుగా బస్సు సౌకర్యం

Follow Udayam on Google
sachin kumar Aug 21, 2026 9:38 AM కామరెడ్డిGeneral
ఈస్సన్న పల్లి మీదుగా బస్సు సౌకర్యం - Udayam
బిక్కనూరు మండలం ఈస్సన్నపల్లి మీదుగా జేబీఎస్కు ఆర్టీసీ అధికారులు బస్సు సౌకర్యం కల్పించినట్లు గ్రామ సర్పంచ్ రాములు తెలిపారు. శుక్రవారం గ్రామానికి తొలిసారిగా వచ్చిన బస్సుకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ బస్సు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించి సౌకర్యం కల్పించారని తెలిపారు.

Comments

G
Loading comments...