వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లాలో మంగపేట మండలం గంపోనిగూడెం రైతువేదికలో ఈనెల 9న మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన మండల స్థాయి అధికారుల ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో బద్రు నాయక్ తెలిపారు.
ప్రభుత్వ పథకాల అమలు, గ్రామాభివృద్ధి పనులు, వివిధ కార్యక్రమాలపై సమావేశంలో సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.
Comments
Loading comments...

