Back to feed
నిర్మల్‌లో మధ్యయుగ యుద్ధవీరుడి శిల్పం గుర్తింపు
Harika Jun 12, 2026 6:35 AM నిర్మల్ 5 views3 days ago

నిర్మల్ జిల్లా గాజులపేట్ సమీపంలోని పంట పొలాల్లో 11-13 శతాబ్దానికి చెందిన అరుదైన యుద్ధవీరుడి శిల్పం (వీరగల్లు) బయటపడింది. సుమారు 4 అడుగుల ఎత్తు, 2.5 అడుగుల వెడల్పు ఉన్న ఈ శిల్పంలో వీరుడు ఖడ్గం, డాలు ధరించి యుద్ధానికి సిద్ధంగా ఉన్న భంగిమలో కనిపిస్తున్నాడు.
ఈ శిల్పం వద్ద రాతి దీప స్తంభం కూడా ఉండటం విశేషం. ఈ చారిత్రక సంపదను కాపాడేందుకు పురావస్తు శాఖ తగిన రక్షణ చర్యలు చేపట్టాలని స్థానిక కళాకారులు కోరుతున్నారు. జిల్లాలో ఇలాంటి మరిన్ని వీరగల్లులు వెలుగుచూసే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు.
Comments
Loading comments...



