Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదర్శప్రాయం: చదువుల తండా!

Follow Udayam on Google
Ravi Shukla May 26, 2026 12:07 PM నిజామాబాద్General
ఆదర్శప్రాయం: చదువుల తండా! - Udayam
పిట్లం మండలంలోని సిద్ధాపూర్‌ గిరిజన తండా అక్షరాస్యతకు నిదర్శనంగా నిలుస్తోంది. కేవలం 60 కుటుంబాలున్న ఈ చిన్న తండాలో 40 మందికి పైగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలిచారు. పట్టువదలని సంకల్పంతో విద్యను ఆయుధంగా మలుచుకుని, ఉపాధ్యాయులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, పోలీస్, బ్యాంక్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. 1963లో వీర్‌సింగ్ ప్రభుత్వ ఉద్యోగం సాధించి తండాకు ఆదర్శంగా నిలిచారు. ఆయన బాటలోనే తండావాసులంతా ఉన్నత విద్యావంతులై వివిధ శాఖల్లో సేవలందిస్తున్నారు. మారుమూల ప్రాంతమైనా, సౌకర్యాలు లేకున్నా పట్టుదలతో కొలువులు సాధించి, నేటి తరానికి ఈ తండావాసులు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Comments

G
Loading comments...