Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో పబ్‌ల వేళల పొడిగింపు

శ్రీజ రెడ్డి Jul 18, 2026 6:30 AM హైదరాబాద్about 2 hours ago
హైదరాబాద్‌లో పబ్‌ల వేళల పొడిగింపు - Udayam Digital
ఫిఫా వరల్డ్‌ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్‌లోని బార్లు, పబ్‌లు, రెస్టారెంట్ల పనివేళలను తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరిగే ఈ మహా సంగ్రామాన్ని వీక్షించే క్రీడాభిమానుల కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో జూలై 20న తెల్లవారుజామున 03:00 గంటల వరకు మద్యం సరఫరాకు అనుమతినిచ్చారు. దీంతో ఆదివారం రాత్రి నుంచే నగరంలో ఫుట్‌బాల్ హంగామా షురూ కానుంది.

Comments

G
Loading comments...