Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆన్‌లైన్ బాటలో బోనాల షాపింగ్

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 18, 2026 7:21 AM హైదరాబాద్General
ఆన్‌లైన్ బాటలో బోనాల షాపింగ్ - Udayam
ఆషాఢ మాసంలో తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల పండగ కొనుగోళ్లు డిజిటల్ బాట పట్టాయి. మార్కెట్లకు వెళ్లే సమయం లేని నగరవాసులు ఇ-కామర్స్, క్విక్ కామర్స్ యాప్‌ల ద్వారా పూజా సామగ్రిని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుంటున్నారు. పండగలో అత్యంత ముఖ్యమైన మట్టి కుండలతో పాటు విభిన్న డిజైన్లతో కూడిన ఇత్తడి బోనం ఘటాలు కూడా ప్రస్తుతం ఆన్‌లైన్ వేదికలపై ట్రెండ్ అవుతూ హోమ్ డెలివరీ అవుతున్నాయి.

Comments

G
Loading comments...