Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం కోసం వృద్ధుడి ఘోర హత్య

పవని రెడ్డి Jul 18, 2026 7:39 AM ఆసిఫాబాద్about 2 hours ago
మద్యం కోసం వృద్ధుడి ఘోర హత్య - Udayam Digital
కుమురం భీం జిల్లా రెబ్బెనలో మద్యం కోసం ఒక వృద్ధుడిని గొడ్డలితో నరికి చంపిన దారుణ ఘటన శుక్రవారం జరిగింది. హైదరాబాద్ వెళ్తున్న కుమార్తెను రైలు ఎక్కించేందుకు వచ్చి బస్టాండ్ వైపు వెళ్లిన మాసండి సోమయ్యపై ఈ దాడి జరిగింది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో దుండగుడు అందరూ చూస్తుండగానే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...