వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్‌కు దీర్ఘకాలిక ఆర్థిక బలం చేకూర్చేలా ఐఆర్‌ఎఫ్‌సీతో రూ.13,600 కోట్ల రుణాల రీఫైనాన్స్ ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో 20 ఏళ్ల కాలపరిమితితో త్రైమాసిక చెల్లింపుల పద్ధతిలో రుణ సౌకర్యం కల్పించేలా అధికారులు సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ మెట్రో 100 శాతం యాజమాన్య వాటా ప్రభుత్వానికి బదిలీ అయినట్లు స్పష్టం చేశారు. మెట్రో కనెక్టివిటీ విస్తరణ ద్వారా నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందన్నారు.
Comments
Loading comments...

