వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లల కోసం ప్రభుత్వం జమ చేసిన తల్లికి వందనం డబ్బులను తన భార్య కాజేసిందని భర్త ఫిర్యాదు చేశాడు. పిల్లలతో కలిసి సోమవారం ఎస్పీ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశాడు.
లింగాయపాలెంకు చెందిన నాగభూషణం పాతగుంటూరుకు చెందిన మహిళను 2018లో రెండో వివాహం చేసుకున్నాడు. నాలుగేళ్లుగా మనస్పర్థలతో ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. ఖాతాలో జమ అయిన పిల్లల డబ్బులను భార్య కాజేసిందని, న్యాయం చేయాలని ఫిర్యాదులో కోరాడు.
Comments
Loading comments...

