Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల ఖాతాల్లోకి భారీగా నిధులు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 06, 2026 2:03 PM హైదరాబాద్General
రైతుల ఖాతాల్లోకి భారీగా నిధులు - Udayam
రాష్ట్రంలో విడతల వారీగా రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఇవాళ 7 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లోకి సాయం అందించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారికంగా ప్రకటించారు. తాజాగా మొత్తం 92,729 మంది రైతుల ఖాతాల్లో రూ.354.96 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. దీనితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 68.37 లక్షల మంది రైతులకు రూ.7,490.72 కోట్ల రైతు భరోసా నిధులు అందినట్లు ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...