Back to feed
ప్రపంచంలోనే హాటెస్ట్ సిటీలుగా భారత నగరాలు!
Nidhi Razdan May 22, 2026 10:17 AM అల్ ఇండియా 11 views5 days ago

భారత్‌లో భానుడి భగభగలకు ప్రజలు అల్లాడుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన టాప్-50 నగరాలన్నీ మన దేశంలోనే ఉన్నట్లు 'AQI.in' వెల్లడించింది. ఒడిశాలోని బాలన్‌గిర్‌లో గరిష్టంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
మహారాష్ట్ర, యూపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు వడగాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. మధ్యాహ్నానికి ముందే అనేక నగరాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండగా, ఈ జాబితాలో సగానికి పైగా ప్రాంతాలు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవే కావడం గమనార్హం.
Comments
Loading comments...


