వార్తలకు తిరిగి వెళ్లండి

ఉరవకొండ మండలం లత్తవరం గ్రామ వద్ద గురువారం సాయంకాలం హంద్రీనీవా కాలవలో గల్లంతైన క్రిష్టిపాడు గోవిందు మృతదేహం శుక్రవారం లభ్యమయింది.
నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి కౌకుంట్ల గ్రామం వద్ద లభ్యమైన మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి బంధువులు ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

