Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెల్మెట్‌పై రూరల్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

Follow Udayam on Google
RR REDDY Aug 21, 2026 5:07 PM నిజామాబాద్General
హెల్మెట్‌పై రూరల్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ - Udayam
నిజామాబాద్ రూరల్: ఈ నెల 22 నుంచి ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ తనిఖీలను ముమ్మరం చేయనున్నట్లు రూరల్ ఎస్‌హెచ్‌ఓ శ్రీనివాస్ తెలిపారు. వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై కేసులు, జరిమానాలతో పాటు వాహనాల సీజ్‌కు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రమాదాల సమయంలో హెల్మెట్ ప్రాణరక్షణగా నిలుస్తుందని అన్నారు.

Comments

G
Loading comments...