వార్తలకు తిరిగి వెళ్లండి

హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడి రహదారులు మూసుకుపోగా, వాహనాలు బురదలో చిక్కుకున్నాయి. పలు ఇళ్లలోకి బురద నీరు చేరింది.
ఇదిలా ఉండగా, చంబా-పఠాన్‌కోట్ జాతీయ రహదారిపై కారు లోయలో పడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. అస్వస్థతకు గురైన చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Comments
Loading comments...
