వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాయచోటితో పాటు చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అయితే వర్షంతో పాటు పిడుగులు పడే ముప్పు ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
మరోవైపు ఈ అకాల వర్షాలు తమకు ఎంతగానో మేలు చేస్తాయని స్థానిక రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత వర్షాలు పంటల సాగుకు, ప్రాథమిక వ్యవసాయ పనులకు ఎంతో అనుకూలంగా మారుతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

