వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లాలో మొత్తం 155.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా ఉరవకొండలో 38.2 మి.మీ, బెలుగుప్పలో 33.6 మి.మీ అత్యధిక వర్షం కురిసింది. అనంతపురంతో పాటు పలు మండలాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షపాతం నమోదైంది.
కుందుర్పి, పెద్దపప్పూరు, బుక్కరాయసముద్రం, గుమ్మగట్ట, కూడేరు ప్రాంతాల్లో కురిసిన ఈ వర్షాలతో జిల్లాలోని పలు చోట్ల నీటి మట్టాలు పెరిగాయి. దీనివల్ల రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

