Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో ఐదు రోజులు భారీ వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Follow Udayam on Google
Kumar Jun 22, 2026 11:43 AM అమరావతిGeneral
ఏపీలో ఐదు రోజులు భారీ వర్షాలు: ఐఎండీ హెచ్చరిక - Udayam
రాష్ట్రంలో జూన్ 22 నుండి 26 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ద్రోణి ప్రభావంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది. కోస్తా, యానాం పరిధిలోని కొన్ని చోట్ల వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...