వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలను ఆకస్మిక భారీ వర్షం ముంచెత్తింది. చందానగర్, మియాపూర్, కేపీహెచ్‌బీ, అమీర్‌పేట, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అబిడ్స్, కోఠి తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన కుండపోత వర్షం కురుస్తోంది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షానికి ప్రధాన రహదారులన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నగర వ్యాప్తంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో గమ్యస్థానాలకు చేరుకునే వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Comments
Loading comments...

