వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగూడెం పట్టణంలో గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులు జలమయమై వాహనదారులు, పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. మార్కెట్ ప్రాంతంలోని రోడ్లు బురదమయంగా మారాయి.
రానున్న 3-4 రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు సూచించారు.
Comments
Loading comments...

