Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమీన్‌పూర్‌లో భారీ వర్షం

విక్రాంత్ రెడ్డి Jun 23, 2026 6:13 AM సంగారెడ్డి 3 viewsabout 2 hours ago
అమీన్‌పూర్‌లో భారీ వర్షం - Udayam Digital
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్, బీరంగూడలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో కాలనీలన్నీ నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీరంగూడలో ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్ పూర్తిగా జలమయమైంది. పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, వర్షానికి దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు.

Comments

G
Loading comments...