Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ, ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 29, 2026 10:24 AM జాతీయంGeneral
తెలంగాణ, ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక - Udayam
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఏపీలోని అల్లూరి, పోలవరం జిల్లాల్లో మోస్తరు వర్షాలు, పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.

Comments

G
Loading comments...