వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి 2.44 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో ప్రాజెక్టు 33 గేట్లు ఎత్తి 2.49 లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలంకు విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం జూరాల నీటిమట్టం 317.37 మీటర్లకు చేరగా, నీటి నిల్వ 7.40 టీఎంసీలుగా ఉంది. ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లోని యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
Comments
Loading comments...

