Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.60కే ఆరోగ్యం.. రామ్మూర్తి వ్యాయామశాల ప్రత్యేకత

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 07, 2026 5:51 PM విజయనగరంGeneral
రూ.60కే ఆరోగ్యం.. రామ్మూర్తి వ్యాయామశాల ప్రత్యేకత - Udayam
విజయనగరం నడిబొడ్డున 1960లో ప్రారంభమైన కోడి రామ్మూర్తి నాయుడు వ్యాయామశాల ఇప్పటికీ ఆరోగ్య ప్రియులకు వేదికగా నిలుస్తోంది. నెలకు రూ.60కే వ్యాయామం చేసే అవకాశం కల్పిస్తోంది. కోడి రామ్మూర్తి నాయుడు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో పాతకాలం నాటి రాళ్లు, చెక్కలు, రాడ్లతో సాధన కొనసాగుతోంది. నగరపాలిక ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ వ్యాయామశాలలో పలువురు అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టర్లు శిక్షణ పొందారు.

Comments

G
Loading comments...