వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో రెండు నెలలుగా జీతాలు అందక 62 వేల మంది అంగన్‌వాడీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు మండిపడ్డారు. నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వారి ఉసురు తగులుతుందని, మహిళా మంత్రి సీతక్క సాటి మహిళల కష్టాలను గుర్తించకపోవడం శోచనీయమని విమర్శించారు.
మహిళలను కోటీశ్వరులను చేస్తామంటున్న సీఎం రేవంత్ రెడ్డి, ముందు అంగన్‌వాడీల వేతనాలు చెల్లించి గౌరవం నిలబెట్టుకోవాలన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అంగన్‌వాడీల జీతాలను భారీగా పెంచి దేశంలోనే అత్యధికంగా చెల్లించిందని, ప్రస్తుత ప్రభుత్వం వారి సేవలను అగౌరవపరుస్తోందని హరీశ్ రావు ధ్వజమెత్తారు.
Comments
Loading comments...

