వార్తలకు తిరిగి వెళ్లండి

MBNR దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం అనంతరం ఆలయ ప్రాంగణంలో హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

