Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో గంజాయి స్మగ్లింగ్‌పై టాస్క్ ఫోర్స్ దాడి.

Gaurav Bidkar Jul 23, 2026 9:36 AM హైదరాబాద్in about 4 hours
హైదరాబాద్‌లో గంజాయి స్మగ్లింగ్‌పై టాస్క్ ఫోర్స్ దాడి. - Udayam Digital
హైదరాబాద్: చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్, బాలాపూర్ పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 22.22 కిలోల గంజాయి, నాలుగు మొబైల్ ఫోన్లు, రెండు ట్రాలీ బ్యాగులు, ఒక బ్యాక్‌ప్యాక్‌తో పాటు సుమారు రూ.12 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఈ గంజాయిని ఒడిశాలోని బెర్హంపూర్ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలించి విక్రయించేందుకు తీసుకొచ్చినట్లు వెల్లడైంది. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.

Comments

G
Loading comments...