Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హామీల అమలుకు బీఆర్‌ఎస్‌ డిమాండ్

Follow Udayam on Google
Naresh Sep 07, 2026 4:48 PM నిర్మల్General
కుబీర్‌ మండల బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 1000 రోజుల పాలన పూర్తయినా ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారంటీల్లో అనేకం అమలు కాలేదని ఆరోపించారు. సోమవారం ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. మహిళలకు రూ.2500 సాయం, రైతు భరోసా, నిరుద్యోగ భృతి తదితర హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...