Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడెం గుట్ట దేవాలయానికి తరలివచ్చిన భక్తులు

Follow Udayam on Google
p.g.murthy Aug 23, 2026 5:24 PM మంచిర్యాలGeneral
గూడెం గుట్ట దేవాలయానికి తరలివచ్చిన భక్తులు - Udayam
దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు. ఆదివారం శ్రావణ శుద్ధ ఏకాదశి కావడంతో మంచిర్యాల జిల్లాతో పాటు పలు ప్రాంతాల నుండి భక్తులు దేవాలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. 154 జంటలు దేవాలయంలోని యజ్ఞశాలలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాయి. దీంతో దేవాలయం పరిసరాలలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

Comments

G
Loading comments...