Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడెం దేవాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి

Follow Udayam on Google
p.g.murthy Aug 15, 2026 11:45 AM మంచిర్యాలGeneral
గూడెం దేవాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి - Udayam
దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి దేవాలయం ఆవరణలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం దేవాలయం కార్యాలయం ఆవరణలో ఈవో శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అందరూ కలిసి వందేమాతరం జనగణమన జాతీయ గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన అర్చకులు గోవర్ధన చారి, కార్యాలయ సూపర్డెంట్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...