Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తిలో నామినేషన్ కౌంటర్ల పరిశీలన

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 1:25 PM అనంతపురంGeneral
గుత్తిలో నామినేషన్ కౌంటర్ల పరిశీలన - Udayam
గుత్తి మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ కౌంటర్లను శుక్రవారం కలెక్టర్ ఆనంద్ పరిశీలించారు. మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల కోసం ఒక కౌంటర్, కౌన్సిలర్ అభ్యర్థుల కోసం 8 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. నామినేషన్ల ఏర్పాట్లపై మున్సిపల్ కమిషనర్ సురేంద్రను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...