వార్తలకు తిరిగి వెళ్లండి

పక్షవాతంతో బాధపడుతున్న తండ్రిని వేధించి, ఆయన ఆత్మహత్యకు కారణమైన కుమారుడికి గుడివాడ 11వ అదనపు జిల్లా కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. తల్లిదండ్రుల భూమిని అమ్మి డబ్బులివ్వాలని కుమారుడు వేధించినట్లు కోర్టులో నిరూపితమైంది.
ఏలూరు జిల్లా కలిదిండి మండలం పోతుమర్రుకు చెందిన కట్టా సత్యనారాయణపై కేసు నమోదైంది. 9 మంది సాక్షులను విచారించిన కోర్టు నేరం రుజువు కావడంతో శిక్ష విధించింది.
Comments
Loading comments...

