వార్తలకు తిరిగి వెళ్లండి

నాగలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. సీనియర్ ఉపాధ్యాయులు శంకర్‌తో పాటు ఉపాధ్యాయులను పూలమాలలు, శాలువాలతో సన్మానించి పూలవర్షం కురిపించారు. ఉపాధ్యాయులే తమను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే మార్గదర్శకులని, వారిని దేవుడితో సమానంగా భావిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినట్లు విద్యార్థులు తెలిపారు.
గురువులకు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

