వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నాయిగూడెం మండలం గుర్రేవుల నుంచి పొలాలకు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. రోడ్డుపై పెద్ద గుంతలు ఏర్పడి, రాళ్లు తేలడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. అత్యవసర పనులపై వెళ్లేవారితోపాటు గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు.
సంబంధిత అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

